HomeTelugu Trendingప్రభాస్‌ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం!

ప్రభాస్‌ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం!

2 25
టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ‘సాహో’ తర్వాత … జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. కానీ అప్పట్లో ఈ సినిమా మూహుర్తం అయిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు ఏవి బయటకు రాలేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. తాజాగా అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు ఫోటోలను చిత్ర యూనిట్ మీడియాకు లీక్ చేశారు. పూజా హెగ్డే పంతులమ్మ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ’20వ’ చిత్రానికి సంగీతం ఎవరు అందిస్తారనే.. విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
..

Recent Articles English

Gallery

Recent Articles Telugu