మరి ఈసారి అరవింద్ ఒప్పుకుంటాడా..?

తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ సినిమాను తెలుగులో ‘ధృవ’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామినే తెలుగు రీమేక్ లో కూడా నటించాలని పట్టుబట్టి మరీ ఆయనను రప్పించారు. దీనికి గాను అరవింద్ స్వామికి భారీ పారితోషికమే ముట్టజెప్పారు. అయితే ఇప్పుడు మరో తెలుగు రీమేక్ కోసం ఆయనను సంప్రదిస్తున్నట్లు టాక్.
అసలు విషయంలోకి వస్తే జయం రవి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తాజాగా నటించిన ‘బోగన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ప్రభుదేవా ఇప్పుడు ఇతర బాషల్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. జయం రవి పాత్రకు తెలుగు, హిందీలలో వేరే హీరోలతో నటింపజేసి అరవింద్ స్వామి పాత్రను మాత్రం ఆయనతోనే చేయించాలనేది ప్రభుదేవా ఆలోచన. ధృవ సినిమాతో తెలుగునాట అరవింద్ క్రేజ్ కూడా బాగానే పెరిగింది. మరి ఈసారి మళ్ళీ రీమేక్ లో నటించడానికి అరవింద్ ఒప్పుకుంటాడా..? అనేది తెలియాల్సివుంది!