‘దృవ’ రిజల్ట్ తేడా పడే ఛాన్స్ ఉందా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ డిసంబర్ 9న ‘దృవ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రానికి ఇదే రీమేక్. తమిళంలో సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం అరవింది స్వామినే అని చెప్పుకుంటారు. ఆ పాత్రను ఆయన తప్ప మరెవరూ చేయలేరనే చరణ్ కూడా తెలుగులో అరవింద్ స్వామితోనే నటింపజేశారు.

అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ లో అరవింద్ రోల్ కు కోత పెట్టారనే టాక్ వినిపిస్తోంది. తని ఒరువన్ లో అరవింద్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. హీరో కనిపించినంత సేపు విలన్ పాత్ర కూడా కనిపిస్తుంది. కానీ తెలుగులో మాత్రం విలన్ పాత్రను కాస్త ప్రాముఖ్యత తగ్గించి తెరకెక్కించారని ప్రచారం జరుగుతుంది. దీంతో సక్సెస్ కావడానికి
కారణమైన పాత్ర నిడివి తగ్గిస్తే సినిమా రిజల్ట్ పై ఆ ప్రభావం పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.