శ్రీముఖి శుభాకాంక్షలు తెలిపిన అనసూయ

 

శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీముఖి..పటాస్ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ షోకి శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా న‌టించిన శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టింది.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంక‌ర్‌గా తెలుగులో చ‌క్రం తిప్పుతుంది. ఈరోజు శ్రీముఖి పుట్టిన రోజు..జరుపుకుంటోంది. దీంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈలాగే ఆరోగ్యంగా ఉంటూ తెలుగు వారిని తన యాంకరింగ్‌తో అలరించాలనీ కోరుకుంటున్నారు.

అయితే.. పుట్టిన రోజు సందర్బంగా హాట్‌ యాంకర్ అనసూయ, శ్రీముఖికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..తెలుగు యాంకర్స్‌లో అందరికంటే వయసులో చిన్న దానివి..ఇలానే మంచిగా యాంకరింగ్ చేస్తూ..ఇంకా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.. నీకు చెప్పాల్సిన అవసరం లేదు..ఈరోజు పుల్‌గా కేకులు తిను..హగ్స్..అంటూ రెండు స్మైలీలు పోస్ట్ చేసింది అనసూయ.

CLICK HERE!! For the aha Latest Updates