HomeTelugu Trendingసందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ రిపీట్

సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ రిపీట్

2 21

విజయ్‌దేవరకొండ, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ కాంబినేషన్‌లో వచ్చిన అర్జున్ రెడ్డి ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తరువాత విజయ్ గీతగోవిందం సినిమా చేశారు. ఇది భారీ విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తరువాత చేసిన సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ను ఇవ్వలేకపోయాయి. తాజాగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం విజయ్ పూరితో ఓ సినిమా చేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హిందీలో అర్జున్ రెడ్డి సినిమా తీసి హిట్ కొట్టాడు. రణవీర్ సింగ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా అది ఇప్పట్లో సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా లేదు. అసలైన క్రైమ్ కథతో సినిమా చేస్తానని సందీప్ సవాల్ చేశారు. ఇప్పుడు ఆ కథతో పాన్ ఇండియా లెవెల్లో విజయ్ దేవరకొండతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu