HomeTelugu Trendingమెగాస్టార్‌కు విలన్‌గా సీనియర్‌ హీరో!

మెగాస్టార్‌కు విలన్‌గా సీనియర్‌ హీరో!

Arvind Swamy as the villain
టాలీవుడ్‌లో ‘రోజా’, ‘ముంబాయి’ వంటి చిత్రాలతో లవర్‌ బాయ్‌గా పెరుతెచ్చుకున్నారు నటుడు అరవింద్‌ స్వామి. ఆయన ఇటీవలే విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్‌ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2016లో వచ్చిన రామ్‌చరణ్‌ ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించి వందశాతం మార్కులు కొట్టేశారు. పలు సినిమాల్లో కూడా విలన్‌గా నటిస్తూ సెటిల్‌ ఆయిపోయడు అరవింద్‌ స్వామి. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్స్‌ లో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో అరవింద్‌ స్వామి విలన్‌గా ‍కనిపించబోతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

ఈ సినిమాలో హీరోకు, విలన్‌కు మధ్య ఉండే సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంట. దీంతో ప్రధాన విలన్‌గా అరవింద్‌ స్వామి కరెక్ట్‌గా సరిపోతారని భావించిన దర్శకుడు ఆయనను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు సినిమా యూనిట్‌ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రస్తుతం ‘ఆచార్య’ హైదరాబాద్‌లోని రామోజీ ఫీలిం సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిరంజీవి షూటింగ్‌లో పాల్గొననున్నారు. కాజల్‌ అగర్వాల్‌ వచ్చే నెల మొదటి వారంలో ఈ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu