HomeTelugu Trendingరహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!

Prabhu Deva got second marr
కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ప్రభుధేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బిహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌తో సెప్టెంబర్‌లోనే ఏడడుగులు వేసినట్టు తెలుస్తుంది. ముంబైలోని ప్రభుదేవా నివాసంలో అత్యంత రహస్యంగా వివాహం చేసుకున్న ఈ కొత్త జంట ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుదేవాకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీడియాతో పంచుకున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుదేవా మాత్రం స్పందించలేదు. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. వెన్నముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుదేవా పిజియోథెరపీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చికిత్స అందించిన డాక్టర్‌తో ప్రభుదేవా ప్రేమలో పడ్డారు. కొంతకాలం డేటింగ్‌ అనంతరం వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒకటయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu