HomeTelugu Trendingమహేష్‌బాబు మేనల్లుడు గ్రాండ్‌ లాంచ్‌.. ఎప్పుడో తెలుసా!

మహేష్‌బాబు మేనల్లుడు గ్రాండ్‌ లాంచ్‌.. ఎప్పుడో తెలుసా!

5 6టాలీవుడ్‌ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ బాబు బావ‌, గుంటూరు పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ‘భ‌లే మంచి రోజు’, ‘శ‌మంత‌క మ‌ణి’, ‘దేవ‌దాస్’ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా.. క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను ద‌క్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రామానాయుడు స్టూడియోలో న‌వంబ‌ర్ 10న గ్రాండ్ లెవ‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. త‌న‌దైన స్టైల్లో డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండ‌గా రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu