HomeTelugu Trendingఅశోక్‌ గల్లా కొత్త సినిమా 'దేవకీ నందన వాసుదేవ'

అశోక్‌ గల్లా కొత్త సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’

Ashok Galla new movie Devak
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా ప్రస్తుతం రెండో సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వలో అశోక్‌ గల్లా 2వ గా వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ఫైనల్‌ చేస్తూ.. టీజర్‌ను లాంఛ్ చేశారు మేకర్స్‌.

ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ టైటిల్‌ ఫిక్స్ చేశారు. నీ బిడ్డకు మరణగండం.. లేదా అతని చేతిలో మరొకరికి మరణం అంటూ సాగే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్‌. ఈ చిత్రానికి
జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ ఈ సినిమాకి కథని అందిస్తున్నాడు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఫస్ట్ యాక్షన్‌ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు.

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ కాగా‌ తమ్మిరాజు ఎడిటర్. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అర్జున్ జంధ్యాల ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu