HomeTelugu Trendingజర్నలిస్ట్‌గా అవికాగోర్‌!

జర్నలిస్ట్‌గా అవికాగోర్‌!

Avika gor as a journalist

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురిగా పరిచయమైన అవికాగోర్‌.. ఆ తరువాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్తమావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్‌ మధ్యలో సినిమాకు కాస్త బ్రేక్‌ తీసుకుంది. ఆ తర్వాత ‘రాజుగారి గది3’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ గ్యాప్‌లో సన్నబడింది కూడా. . ప్రస్తుతం ఆదిసాయికుమార్‌తో సజ్జా వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న చిత్రం ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1’లో అవికాగోర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోఈమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తుంది. ఓ కేసుని అవికాగోర్‌ శోధిస్తున్న సమయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే సినిమా కథాంశం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu