నాగచైతన్యకు పబ్లిక్‌గానే ముద్దుపెట్టేసిన సాయి పల్లవి.. ఏడ్చేసిన చైతు

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతున్నది. లవర్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. ఏ పిల్లా అనే మ్యూజికల్ ప్రివ్యూ సాంగ్ రిలీజ్ చేశారు. ఒకమ్మాయి, అబ్బాయి మధ్య ఎలాంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎంత బలంగా ఉంటుంది. బలమైన ప్రేమ ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య బంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయాలను ఈ సాంగ్ లో చూపించారు.

సాంగ్ లో చూపించిన విధంగా సినిమా సినిమా ఉండబోతుందా లేదా అన్నది పక్కన పెడితే సాంగ్ మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంది. ఇక ఇందులో ట్రైన్ లో వెళ్లే సమయంలో సాయి పల్లవి పక్కనే కూర్చున్న చైతును ముద్దుపెట్టుకుంటుంది. చుట్టూ చాలామంది ఉంటారు. కానీ, చైతూను సాయి పల్లవి అలా ధైర్యం చేసి ముద్దుపెట్టుకోవడంతో చైతు షాక్ అవుతారు. చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతాడు. వాటిని చైతు తన హావభావాల రూపంలో చాలా చక్కగా చూపించారు. లవర్ డే రోజున విడుదల చేసిన ఈ మ్యూజికల్ ప్రోమో ఆకట్టుకుంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates