HomeTelugu Trendingరవితేజ వారసుడి ఎంట్రీ.. ఫస్ట్‌లుక్‌ విడుదల

రవితేజ వారసుడి ఎంట్రీ.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Ay Pilla movie First Look

మాస్‌ మహరాజా రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయమవుతున్నాడు. ఇక ఈ సినిమాను గతంలో పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. రమేశ్ వర్మ కథను అందించిన ఈ సినిమాకి లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి ‘ఏయ్ పిల్లా’ అనే టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాతో, రుబల్ షెకావత్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

20220809fr62f1f843677f8

Recent Articles English

Gallery

Recent Articles Telugu