ఈశా అంబానీ నిశ్చితార్థ వేడుక

భారత బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఈశా అంబానీ ఎంగేజ్‌మెంట్ ఆనంద్ పిరమాల్‌తో జరగనున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి. పిరమాల్‌ గ్రూప్స్‌ వారసుడైన ఆనంద్‌ పిరమాల్‌ను ఈశా పెళ్లాడనున్నారు. ఇందులో భాగంగా వివాహ నిశ్చితార్థం ఇటలీలోని ప్రఖ్యాత కోమ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ వేదికను చూస్తుంటే కథల్లో వర్ణించినట్లు అందంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో తీసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో ముఖేశ్ తన కూతురు చేయి పట్టుకొని ఆనంద్ వద్దకు తీసుకెళ్లి అతడికి అప్పగించారు.

తరవాత ఆనంద్, ఆమె కలిసి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో నీతా అంబానీ ఆనందంతో చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న ఈశా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ, అతడికి కాబోయే భార్య శ్లోక మెహతా చేతిలో చేయి వేసి తండ్రి వెనకాలే నడుచుకుంటూ రావడం కనిపిస్తోంది. వారి వెనకాల మరో సోదరుడు అనంత్ కూడా ఉన్నాడు. మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలకు బాలీవుడ్ సెలబ్రిటీలు, స్నేహితులు హాజరయ్యారు. వారందరూ ఇటలీకి చేరుకున్నారు. పిరమాల్ గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరమాల్ కుమారుడు ఆనంద్ పిరమాల్.