బేబీ హీరోయిన్ ‘వైష్ణవి చైతన్య’కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వైష్ణవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒకటి రెండు ప్రాజెక్టులలో ఆమె పేరు వినిపిస్తోంది. తాజాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ప్రాజెక్టు విషయంలోను ఆమె పేరు తెరపైకి వచ్చింది.
‘డీజే టిల్లు’ హీరో సిద్ధూ జొన్నలగడ్డతో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో వైష్ణవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టుగా టాక్. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా నుంచి, త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.