బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌కు కరోనా!


దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. నానాటీకి కొత్త కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్‌లు సైతం ఇటీవల కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా అమీర్ కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని, వైద్యుల సూచనలను పాటిస్తున్నారని ఆయన‌ సన్నిహితులు వెల్లడించారు. అంతేకాకుండా సిబ్బందిని సైతం ఆయన కొవిడ్‌-19 పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates