Bachchala Malli OTT release date:
డిసెంబర్ 2024లో విడుదలైన అల్లరి నరేశ్ చిత్రం ‘బచ్చల మల్లి’ మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా అందరికీ నచ్చలేకపోయినా, అల్లరి నరేశ్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఆయన నటన ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ముందుగా ఈ సినిమా మూడు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోందని వార్తలు వచ్చాయి. అవి Amazon Prime Video, ETV Win, Sun NXT. అయితే, తాజా సమాచారం ప్రకారం, ETV Win జనవరి 10, 2025 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే రేపటినుంచే ప్రేక్షకులు ఈ సినిమాను ఆన్లైన్‌లో చూడవచ్చు.
#BachhalaMalli will premiere on ETV Win from tomorrow.
Also expected to premiere on Sun NXT and Amazon prime. pic.twitter.com/6EGpMDl9ub
— Cinema Brainiac (@CinemaBrainiac) January 9, 2025
ఇతర రెండు ప్లాట్‌ఫామ్స్ అయిన Prime Video, Sun NXT కూడా అదే రోజున స్ట్రీమింగ్ ప్రారంభించనున్నాయా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో అల్లరి నరేశ్‌తో పాటు అమృత అయ్యర్, రావు రమేష్, రోహిణి, హర్షా చేముడు, అచ్యుత్ కుమార్, బలగం జయరాం, హరి తేజ, ప్రవీణ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. సినిమాలో ఉన్న పాటలు, BGM కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, OTT వేదికపై ఈ సినిమా మంచి స్పందన అందుకుంటుందని టీమ్ ఆశిస్తోంది
ALSO READ: Salman Khan అందుకే పెళ్లి చేసుకోలేదు.. తండ్రి బయటపెట్టిన షాకింగ్ నిజం!