Salman Khan’s marriage:
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పగానే అభిమానులకు గుర్తొచ్చేది అతని బాక్సాఫీస్ హిట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితం కూడా. సల్మాన్ ఇప్పటికీ అవివాహితుడు కావడం అందరికీ ఆసక్తి కలిగించే విషయం. ఆయన కత్రినా కైఫ్, సంగీత బిజ్లానీ వంటి ప్రముఖ నటిలతో ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి వరకు మాత్రం వెళ్ళలేదు. ఈ విషయం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయింది.
ఇటీవల సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలైన కారణాన్ని వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, సల్మాన్ పనిచేస్తున్నప్పుడు తన సహ నటీమణుల అందానికి ఆకర్షితుడు అవుతాడు. కానీ, సంబంధం సీరియస్‌గా మారిన తర్వాత అతనిలో వివాదాస్పదమైన ఆలోచనలు వచ్చేస్తాయట.
సలీమ్ ఖాన్ చెప్పిన ఒక కీలక విషయం ఏమిటంటే, సల్మాన్ తన భాగస్వామిని తన తల్లిలా ఉండాలని ఆశిస్తాడట. “తనకు నచ్చిన అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. కానీ, అతను ఆ అమ్మాయిలో తన తల్లి లక్షణాలు కనిపించాలని అనుకుంటాడు” అని సలీమ్ వివరించారు.
అంతేకాదు, సల్మాన్ తన భార్య కేవలం ఇంటి పనులు చేసుకోవాలని ఆశిస్తాడని, పిల్లలకు హోంవర్క్ చేయించటం, కుకింగ్ చేయడం వంటి బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటాడని చెప్పారు. కానీ, ఈ ఆశయాలు ఆధునిక యుగంలో ఉన్న మహిళలకి నచ్చదని అన్నారు.
ఈ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో అభిమానులు సల్మాన్ నిర్ణయంపై చర్చిస్తున్నారు. కొందరు సల్మాన్‌ని అర్థం చేసుకుంటే, మరికొందరు ఆయన అభిప్రాయాలను పాతకాలం ఆలోచనలు అంటున్నారు.
సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘సికందర్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈద్ 2025 లో విడుదల కానుంది. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ALSO READ: Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: ఈ ఏడాది సంక్రాంతి విజేత ఎవరు అవ్వచ్చు?