బాహుబలి2 సెట్ లో మెగాస్టార్!

రాజమౌళి రూపొందిస్తోన్న బాహుబలి2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ
ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడే ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది.
కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వినాయక్, చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు. ఆ పక్క ఫ్లోర్
లోనే ‘బాహుబలి2’ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న చిరంజీవి విరామ సమయంలో
‘బాహుబలి2’ సెట్స్ కి వెళ్లారు. రాజమౌళి, ప్రభాస్ లను పలకరించడంతో పాటు షూటింగ్
ఎలా జరుగుతుందో అడిగి మరీ తెలుసుకున్నారు. చిరు రాక పట్ల రాజమౌళి ఆనందాన్ని
వ్యక్తం చేయగా.. ప్రభాస్ ఆయన వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాడు. అలాంటి సమయంలో
తీసుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates