HomeTelugu Trendingబాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ఖరారు

బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ఖరారు

Bhagavanth Kesari forst look poster

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్. ఆయన సినిమా టైటిల్ దగ్గర నుంచి పవర్ ఫుల్‌గా ఉండాలని అభిమానూలు కోరుకుంటారు. అలాగే ఆయన సినిమాల్లో డైలాగ్స్ కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. ఫైట్స్, డాన్స్ కూడా ప్రత్యేకంగా ఊహించుకుంటారు. బాలయ్య సినిమా అంటే ఇలా ఉంటుందని ప్రేక్షకుల్లో ఓ ముద్ర ఉంటుంది.

ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టుగానే బాలకృష్ణ 108వ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఖరారు చేశారు మేకర్స్.

బాలకృష్ణ తాజా చిత్రానికి ‘భగవంత్ కేసరి’ టైటిల్ ఫిక్స్ చేశారు. కొంతకాలంగా ఇదే టైటిల్ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ బాలకృష్ణ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల ఊహలకు తగ్గట్టు మరో పవర్‌ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు బాలయ్య. ఒక బలమైన ఆయుధాన్ని నేలలో దించినట్టు ఉన్న సీన్ చూస్తుంటే బాలకృష్ణ ఫైట్ సీన్‌లా కనిపిస్తోంది.

దసరాకు విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలయ్య పక్కన కాజల్ నటిస్తుండగా ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu