‘ఎన్టీఆర్’ వేదికపై బోయపాటితో సినిమా ప్రకంటించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల హిట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. వీరి కలయికలో ‘సింహ, లెజెండ్’ వంటి భారీ హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కలయికలో మూడో చిత్రం రూపొందనుంది. కొద్దిసేపటి క్రితమే బాలకృష్ణ ఈ సినిమాను ‘ఎన్టీఆర్’ చిత్ర ఆడియో వేడుకలో ప్రకటించారు. దీన్ని బాలయ్య స్వయంగా తన ఎన్.బీ.కే ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్ర షూటింగ్‌ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది. ఈ సినిమా గురించి బోయపాటి సినిమా మాట్లాడుతూ రాబోయే చిత్రం ‘సింహ, లెజెండ్’ ను ఒక పది శాతం ఎక్కువగానే ఉంటుందని అన్నారు.