HomeTelugu Trending'జబర్దస్త్‌' జడ్జీగా బాలకృష్ణ!

‘జబర్దస్త్‌’ జడ్జీగా బాలకృష్ణ!

Balakrishna as jabardasth

నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్‌లో అప్పట్లో ‘బొబ్బిలి సింహం’, భైరవద్వీపం’ సూపర్‌హిట్స్‌ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు విడుదలై సుమారు 28 సంవత్సరాలైనప్పటికీ ఈ జోడీకి క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తే చూడాలని వారి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రోజా.. బాలకృష్ణకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సంభాషణకు ‘జబర్దస్త్‌’ షోలో జరిగింది.

రోజా, మనో జడ్జిలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో బయటకు వచ్చింది. ‘మేడమ్‌.. మా అందరి సమక్షంలో ఇప్పుడు మీరు బాలకృష్ణ సర్‌కు ఒక్కసారి కాల్‌ చేయాలి’ అని అనసూయ కోరడంతో.. ‘మంచి మూడ్‌లో ఉంటే ఓకే. లేకపోతే..’ అంటూ రోజా టెన్షన్‌ పడుతూ బాలయ్యకు ఫోన్‌ చేసి.. ‘హలో సర్‌.. బాగున్నారా?’ అని అడగ్గా.. ‘ రోజాగారు నమస్కారం. బాగున్నానమ్మా. మన అఖండ షూట్‌లో ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు.

అనంతరం.. ‘మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం. ‘భైరవద్వీపం’ పార్ట్ 2నా? లేక ‘బొబ్బిలిసింహం’పార్ట్‌ 2నా?అని అందరూ అడుగుతున్నారు?’అని రోజా అనడంతో.. ‘మన కాంబినేషన్‌ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు’ అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ‘జబర్దస్త్‌’ జడ్జీగా తాను వస్తానని ఆయన అన్నారు. ఆయన మాటలతో ‘జబర్దస్త్‌’ సెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. అసలు బాలకృష్ణకు రోజా ఎందుకు ఫోన్‌ చేశారో తెలియాలంటే వచ్చే గురువారం వరకూ ఎదరు చూడాల్సిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu