HomeTelugu Trendingఉగాదికి 'BB3' టైటిల్‌!

ఉగాదికి ‘BB3’ టైటిల్‌!

balakrishna boyapati movie
నందమూరి బాలకృష్ణ హీరోగా..బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘BB3’ వర్కింగ్‌ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పేరును ఉగాది రోజున ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌పై సోషల్‌ మీడియాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకదానిని ఖరారు చేస్తారా? లేదా మరో కొత్త టైటిల్‌ పెడతారా? అనే విషయం తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే. ఇందులో పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu