HomeTelugu Trendingమోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య

2 4
టాలీవుడ్‌ నటసింహం నందమూరి బాలకృష్ణ తన నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. దేవతలు ఆశీర్వదించిన రోజున మోక్షజ్ఞ సినీ ఎంట్రీ జరుగుతుందని అన్నారు. మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి ఉందని, మంచి ముహూర్తం చూసి లాంచ్ చేయడమే తరువాయి అని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో కొంచెం లేటైనా మోక్షజ్ఞ సినిమాలలోకి రావడం ఖాయం అని తెలుస్తోంది. మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu