HomeTelugu Big Stories'రూలర్' లో డాన్స్‌ అదరగొట్టిన బాలయ్య

‘రూలర్’ లో డాన్స్‌ అదరగొట్టిన బాలయ్య

3 15టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ బెస్ట్ డాన్సర్స్‌లో ఒకరు. 60లో కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో దుమ్ము దులిపేస్తుంటాడు. ఆయన తాజాగా నటించిన ‘రూలర్’ సినిమాలో కూడా స్థాయిలో ఊపేశాడు బాలయ్య. కేయస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ప్రోమో వీడియోలో బాలయ్య డాన్సులు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. అసలు ఈ ఏజ్‌లో ఆయన డాన్సులేంటో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పడతాడు తాడు తాడు అంటూ రప్ఫాడించేస్తున్నాడు బాలయ్య.

ఈ ప్రోమో సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులేసాడు. ఈ సీనియర్ హీరో జోరు చూసి వామ్మో అనుకుంటున్నారు ప్రేక్షకులు. గతంలో కూడా అమ్మకుట్టి అమ్మకుట్టి అంటూ రెచ్చిపోయిన బాలయ్య.. ఇప్పుడు పడతాడు అంటూ చిందులు చించేసాడు. ఈయనతో జానీ మాస్టర్ స్టెప్పులు ఇరగదీసాడు. ఈ పాటలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. ఆమె బికినీ సోకులు కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. ఇక వేదిక మరో హీరోయిన్. మొత్తానికి బాలయ్య స్పీడ్.. జోరు చూసి అంతా వారెవ్వా అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu