HomeTelugu Trendingఅనిల్ రావిపూడితో 'రామారావు'గా బాలయ్య!

అనిల్ రావిపూడితో ‘రామారావు’గా బాలయ్య!

6 29
సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 చిత్రం స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడు. పటాస్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి ‘రామారావు’ అనే స్క్రిప్ట్ ను బాలకృష్ణకు వినిపించాడట. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించేందుకు ఆసక్తి కనబర్చాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. గతంలో చెప్పిన రామారావు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులుచేయాలని బాలయ్య సూచించాడట. ప్రస్తుతం ఎఫ్‌-3 చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి ఆ తర్వాత బాలయ్యతో కలిసి రామారావు సినిమా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. బాలయ్య ప్రస్తుతం బోయపాటితో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ తో కలిసి బాలయ్య మరో సినిమా చేయబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu