HomeTelugu Trendingబాలయ్య 105వ మూవీ ఫస్ట్‌లుక్‌ చూశారా

బాలయ్య 105వ మూవీ ఫస్ట్‌లుక్‌ చూశారా

4 18నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 105వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో బాలయ్య సూట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ లుక్‌కు సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య బరువు తగ్గినట్లు ఫస్ట్‌లుక్‌ను బట్టి తెలుస్తోంది. కె.ఎస్‌. రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్‌ పాత్రలు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది బాలయ్య ‘ఎన్‌.టి.ఆర్: కథానాయకుడు‌’, మహానాయకుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాల్ని రూపొందించారు. దీని తర్వాత కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్‌ పూర్తయింది.

4a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu