HomeTelugu Big Stories'BB3' టైటిల్‌ వచ్చేసింది

‘BB3’ టైటిల్‌ వచ్చేసింది

Balakrishna new movie title

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైన ఈ సినిమా టైటిల్‌ని తాజాగా ప్రకటించారు. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రానికి ‘అఖండ’ అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను షేర్‌ చేశారు. ఇందులో ‘కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ అదరగొడుతుంది.

ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో హీరోయిన్‌ పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సింహా’ , ‘లెజెండ్‌’ తర్వాత బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu