HomeTelugu Trendingఆఫీసర్‌ 'ధర్మ' గా బాలయ్య

ఆఫీసర్‌ ‘ధర్మ’ గా బాలయ్య

2 23నందమూరి అభిమానులకు దీపావళి కానుక వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళీ పండగ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, సరికొత్త లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తాజా చిత్రానికి ‘రూలర్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఇందులో బాలకృష్ణ పోలీస్‌ ఆఫీసర్‌ ‘ధర్మ’ అనే పాత్రలో కనిపించనున్నారు.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బాలకృష్ణ లుక్‌ ఆకట్టుకోగా, తాజా పోస్టర్‌ అభిమానులను మరింతగా అలరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘రూలర్‌’ను క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu