HomeTelugu Trendingబాలయ్య 'రూలర్‌' యంగ్‌ లుక్‌

బాలయ్య ‘రూలర్‌’ యంగ్‌ లుక్‌

10 8స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ ‘రూలర్‌’ సినిమాలో మరింత స్టైలిష్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందులో బాలయ్య కుర్రాడిలా కనిపించి, ఆకట్టుకున్నారు. ఆయన వేషధారణ, లుక్‌ గత చిత్రాలతో పోలిస్తే సరికొత్తగా అనిపించింది. డిసెంబరు 20న ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘రూలర్‌’ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ప్రస్తుతం కేరళలో బాలకృష్ణ, నటి వేదికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయబోతున్నారట. దీనికి కె.ఎస్‌. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన, బాలయ్య కాంబినేషన్‌లో ‘జై సింహా’ వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu