అనిల్‌ రావిపూడితో బాలయ్య 107వ చిత్రం!


టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి చిన్న సినిమాలతో కెరీయర్‌ ప్రారంభించి ఏకంగా సూపర్ స్టార్‌ ను డైరెక్టర్ చేసే రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు… తొలి సినిమా నుంచే తనదైన కామెడీ టైమింగ్ తో కమర్సియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నటించేందుకు స్టార్ హీరోలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఈ సంక్రాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇండస్ట్రీ హిట్ తో సత్తా చాటాడు. ఈ సినిమా విజయం తరువాత అనిల్ రేంజ్‌ మరింత పెరిగిపోయింది. దీంతో అనిల్ తో సినిమా చేయాలని చాలా మంది టాప్ హీరోలు ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇటీవల ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో మరియు మోక్షజ్ఞతో సినిమా చెయ్యాలని ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందట. ఇటీవల బాలయ్యకు అనిల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. దీంతో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తన కెరీర్లో 107వ చిత్రంగా తెరకెక్కనుంది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.