HomeTelugu Big Storiesప్రశాంత్‌ వర్మపై బాలయ్య ప్రశంసలు

ప్రశాంత్‌ వర్మపై బాలయ్య ప్రశంసలు

Balakrishna praises on Pras

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్‌’ . ప్రశాంత్‌వర్మ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి సంద్భరంగా జనవరి 12న గట్టి పోటీ నడుముగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన హనుమాన్‌ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

తాజాగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌కు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సినిమా తెరకెక్కించిన ప్రశాంత్‌ వర్మపై ప్రశంసలు కురిపించాడు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ, ప్రశాంత్‌ వర్మ, నిర్మాత నిరంజన్‌ రెడ్డి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా అందించిన మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

Balakrishna1

హాలీవుడ్ రెంజ్‌లో డిజైన్‌ చేసిన విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు.

కాగా ఈ సినిమాతో పాటుగా గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్‌ మూవీలు ఈ సంక్రాంతి సందడి చేయగా.. వీటికి పోటీగా ఈ సినిమా నిలబడ గలిగింది. కటెంట్‌ బాగుంటే.. కటౌట్‌ తో పనిలేదు అని ఈ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా తేజ సజ్జా కెరీయర్‌కు ప్లస్‌ అవుతుంది అనడంలో సందేహం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu