HomeTelugu Trendingబాలకృష్ణ 107వ సినిమా సెట్స్ నుంచి పిక్.. వైరల్‌

బాలకృష్ణ 107వ సినిమా సెట్స్ నుంచి పిక్.. వైరల్‌

Balakrishna selfie with shr
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరుగుతోంది. ఈ సినిమా లొకేషన్ నుంచి ఒక సెల్ఫీ ని దర్శకుడు గోపీచంద్ మలినేని షేర్ చేశాడు. బాలకృష్ణ .. శృతి హాసన్.. గోపీచంద్ ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ ఫస్టు మూవీ విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, తన సినిమా నుంచి గోపీచంద్ మలినేని ఈ ఫొటోను షేర్ చేశాడు.

బాలకృష్ణ తన కెరియర్లో చేసిన తొలి సినిమా ‘తాతమ్మ కల’. ఎన్టీ రామారావు నటించి .. దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 1974 .. ఆగస్టు 30వ తేదీన విడుదలైంది. అలా బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నట్టు అయింది. ఇక బాలయ్య 107వ సినిమాకి త్వరలోనే టైటిల్ ను సెట్ చేయనున్నారు. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu