‘పచ్చీస్‌’ ట్రైలర్‌


టాలీవుడ్‌ యువ నటుడు రానా ద‌గ్గుబాటి థ్రిల్ల‌ర్ జానర్ కు చెందిన ‘ప‌చ్చీస్’ మూవీ ట్రైల‌ర్ ను త‌న సోష‌ల్ మీడియా రిలీజ్‌ చేశారు. గ‌తంలో దీని టీజ‌ర్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేయ‌డంతో దానికి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా లో సెల‌బ్రిటీ స్టైలిష్ రామ్జ్ ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌గా, స్వాతి వ‌ర్మ‌, జ‌య‌చంద్ర‌, ర‌వి వ‌ర్మ‌, ద‌యానంద్ రెడ్డి, కేశ‌వ్ దీప‌క్, శుభ‌లేఖ సుధాక‌ర్, విశ్వేంద‌ర్ రెడ్డి ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీకృష్ణ‌, రామ సాయి ద్వ‌యం ద‌ర్వ‌క‌త్వం వహించగా కౌషిక్ కుమార్ కాతూరి ఈ సినిమాను నిర్మించాడు. స్మ‌ర‌ణ్ సాయి స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ సినిమాలోని పాట‌ల‌ను మ్యాంగో మ్యూజిక్ లో వినొచ్చు. అయితే యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీని థియేట‌ర్ల‌లో కాకుండా… ఈ చిత్రాన్ని జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గాంబ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా ట్రైల‌ర్ ను చూస్తుంటే… వీక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతిని క‌లిగించేట్టుగా ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates