HomeTelugu Trendingకరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు.. రాదు: బాలకృష్ణ

కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు.. రాదు: బాలకృష్ణ

Balakrishna sensational com
నందమూరి బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కరోనాకు వ్యాక్సిన్‌ రాలేదు… అసలు వ్యాక్సిన్‌ రాదు’ అని అన్నారు. విర్గో పిక్చర్స్‌ బ్యానర్‌పై వస్తున్న ‘సెహరీ’ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆయన సోమవారం లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని అన్నారు. ‘మనం జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు అది నిజం కాదు. అసలు వాక్సిన్ వచ్చే అవకాశాలు లేవు. ఇవాళ నుండి కార్తీక సోమవారం. అయిన సరే తల స్నానాలు చేయవద్దు’ అని ఆయన సూచించారు. కాగా కరోనా కట్టడికి పలు దేశాల్లో వ్యాక్సిన్‌పై ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ మూడవ దశ మానవ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకొని ప్రపంచం ముంగిట్లోకి రానున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu