HomeTelugu Trendingఅన్‌స్టాపబుల్ NBK2 షూటింగ్‌కు పవన్ కల్యాణ్

అన్‌స్టాపబుల్ NBK2 షూటింగ్‌కు పవన్ కల్యాణ్

Balakrishna Unstopable 2 wi
బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌ మంచి జోష్‌మీద కొనసాగుతోంది. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ షోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడొస్తారా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చేసింది. డిసెంబర్ 27న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన షూటింగ్‌లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ మీరంతా ఎవరికోసం ఎదురుచూస్తున్నారో ఆయన వచ్చేస్తున్నారు. ఇవాళ చాలా బిగ్గెస్ట్ అండ్ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.

NBK X PSPK

పవన్ కల్యాణ్‌తో జరిగే ఈ ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్‌లోని సీక్రెట్స్‌ ఈ షో ద్వారా బాలకృష్ణ బయటకు తెస్తారని అనుకుంటున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోలను చూడాలని అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు క్యూ కట్టారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ కోసం పవన్‌ కల్యాణ్‌తో పాటు దర్శకుడు క్రిష్ కూడా హాజరయ్యారు.

వీరిద్దరి ఎపిసోడ్‌పై అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబుతో చేసిన ఎపిసోడ్ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో చేస్తున్న ఈ ఎపిసోడ్ ఓటీటీ చరిత్రలో రికార్డ్ క్రియేటే చేయబోతుందని అంచనా వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu