HomeTelugu Big Storiesబాలయ్య అభిమానులకు పండగే.. ఈ రోజే డబుల్ ట్రీట్‌..

బాలయ్య అభిమానులకు పండగే.. ఈ రోజే డబుల్ ట్రీట్‌..

1a

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజునా అభిమానులకు ఏదో ఒక సర్ ప్రయిజ్ ను ఇస్తారు. తన 60వ పుట్టిన రోజు విషయంలో మాత్రం, ఒకరోజు ముందే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రోజు సాయంత్రం తాను స్వయంగా పాడిన ఓ పాటను ఆయన అందించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఎన్బీకే ఫిల్మ్స్, సాయంత్రం 5.03 నిమిషాలకు అభిమానులకు ఈ బహుమతి అందుతుందని తెలిపారు. యూట్యూబ్ ద్వారా ఈ పాట రిలీజ్‌ కానుంది. ఇదే సమయంలో బాలయ్య అభిమానులకు మరో గిఫ్ట్ రాత్రి 7.09 గంటలకు అందనుంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రానికి సంబంధించినది.

‘బీబీ3’ గర్జన ఈ రాత్రి 7.09కి వినిపించనుందని ద్వారకా క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. నందమూరి నటసింహం పుట్టిన రోజు కానుకగా, దీన్ని విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ ట్వీట్ ను బోయపాటి శ్రీను, థమన్, మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులకు ట్యాగ్ చేసింది. ఇక బాలయ్య అందించే ఈ డబుల్ ట్రీట్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu