దేవాకట్టాతో శర్వానంద్!

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ కు మంచి క్రేజ్ ఉంది. వరుస విజయాలంటే తన టాలెంట్ ను నిరూపిస్తోన్న ఈ యంగ్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభిరుచిగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దేవకట్టా డైరెక్షన్ లో శర్వా సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. గతంలో శర్వా.. దేవకట్టా రూపొందించిన ‘ప్రస్థానం’ సినిమాలో నటించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.

దర్శకుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టిన చిత్రమది. కానీ ఆ తరువాత ఆయన రూపొందించిన సినిమాలు దేవకట్టాను వెనక్కి నెట్టేశాయి. ఈ నేపధ్యంలో ఆయనతో సినిమా చేయడానికి శర్వానంద్ ముందుకు రావడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది!