HomeTelugu Trendingమోక్షజ్ఞ లుక్‌తో ఆశ్చర్యపోతున్న అభిమానులు

మోక్షజ్ఞ లుక్‌తో ఆశ్చర్యపోతున్న అభిమానులు

10 8టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అన్ని కుదరితే.. ఈ పాటికే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేవాడే. కాల్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌ తరువాత నందమూరి ఫ్యామిలీ నుంచి హీరో వచ్చిన పదిహేనేళ్లు కావొస్తోంది. తాజాగా 60వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య పలు ఛానల్‌లకు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఈ సందర్భంగా త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చాడు. ఆయన కోసం దర్శకులు కథలను రెడీ చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రస్తావించాడు. తాజాగా బాలయ్య 60 పుట్టినరోజు వేడుకల్లో ఆయన తనయుడు ‘మోక్షజ్ఞ’ లుక్‌ని చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురౌతున్నారు.

త్వరలో హీరోగా తెరంగేట్రం చేయబోతున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పర్సనాలిటీ చూసి అభిమానులు గందరగోళానికి గురయ్యారు. హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే ముందుగా ఫిట్‌గా తయారవ్వాల్సిందే. ఇదంతా జరగాలంటే మరో ఏడాది పట్టొచ్చని అంటున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించినా మోక్షజ్ఞను ఇప్పట్లో తెరపై చూడలేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది నటవారసులు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. 14 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు వచ్చేసరికి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యను ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే 25 ఏళ్లు వచ్చిన మోక్షజ్ఞ అభిమానుల కోరికను ఎప్పటికి తీరుస్తాడో చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu