HomeTelugu Trendingమిథున్ చక్రవర్తి కొడుకుపై లైంగికదాడి కేసు

మిథున్ చక్రవర్తి కొడుకుపై లైంగికదాడి కేసు

Rape case on MithunChakrabo
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ చక్రవర్తిపై లైంగికదాడి కేసు నమోదు అయ్యింది. తనను వివాహం చేసుకుంటానని శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహాక్షయపై ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది బాధితురాలు. తాను మహాక్షయ నాలుగేళ్లపాటు సహజీవనం చేశామని ఆమె చెప్పుకొచ్చింది.

అనంతరం పెళ్లి మాట ఎత్తితే తనను మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. గర్భం దాల్చడంతో బలవంతంగా తనకు అబార్షన్‌ చేయించారని, కేసు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని మహాక్షయ తల్లి యోగితా బాలి కూడా తనను బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మహాక్షయ గతంలో కూడా ఇలాంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. రెండేళ్లక్రితం భోజ్‌పురి నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికదాడి, గర్భస్రావం చేసినట్లు మహాక్షయపై ఆరోపణలు వచ్చాయి.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu