HomeTelugu Trendingతన సూపర్‌ హిట్‌ సాంగ్‌ను రీమేక్‌ చేయనున్న బాలయ్య

తన సూపర్‌ హిట్‌ సాంగ్‌ను రీమేక్‌ చేయనున్న బాలయ్య

3 26
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.   కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ కు జంటగా శ్రియ, అంజలి హీరోయిన్‌లుగా ఎంపికైయ్యారు. తమన్ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

ఇక బాలకృష్ణ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బంగారాబుల్లోడు’ సినిమాలోని ‘స్వాతిలో ముత్యమంత’ సాంగ్‌ ఒకటి. ఆ పాట ఇప్పటికీ హుషారెత్తించే పాటనే. ఆ పాటను రీమిక్స్ చేస్తే అభిమానులు ఖుషీ అవుతారని బాలకృష్ణకి తమన్ చెప్పాడట. తన సాంగ్ రీమిక్స్ లో మరోసారి స్టెప్స్ వేసే ఛాన్స్ కి బాలయ్య ఆనందంగా అంగీకరించాడట. ఈ పాటను బాలకృష్ణ – అంజలిపై చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని అంటున్నారు అభిమానులు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu