HomeTelugu Trendingశ్రీ గణపతి సచ్చిదానంద బయోపిక్‌ ప్రకటించిన బండ్ల గణేష్‌

శ్రీ గణపతి సచ్చిదానంద బయోపిక్‌ ప్రకటించిన బండ్ల గణేష్‌

Bandla ganesh announced sri

ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆదివారం సచ్చిదానంద స్వామి బయోపిక్ ప్రకటనను చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ‘ అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా. ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? సచ్చిదానంద స్వామి పాత్ర ఎవరు పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను బండ్ల గణేష్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డేగల బాబ్జీ’ సినిమా షూటింగ్ లో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu