గురూజీ అనుకుంటే ఎవర్నైనా వేరు చేస్తాడు.. బండ్ల గణేశ్‌ ట్వీట్‌

బండ్ల గణేశ్ తరచూ సోషల్‌ మీడియాలో ఎదో ఒక అంశంపై స్పందిస్తూ.. వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా బండ్ల గణేష్‌ గురూజీ ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశాడు. ఈ రోజు ఉదయం బండ్ల గణేశ్ ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘బండ్లన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది?’ అని అడిగాడు. బదులిచ్చిన బండ్ల గణేశ్.. ‘గురూజీని కలవండి, ఖరీదైన బహుమతి ఇవ్వండి.. అంతే అయిపోతుంది’ అని పేర్కొన్నారు. అయితే ప్రొడ్యూసర్ కావాలని ఉందని చేసిన ట్వీట్ ను సదరు యూజర్ తర్వాత తీసేశాడు.

‘గురూజీకి కథ చెబితే స్క్రీన్ ప్లే రాసి.. దానికి తగట్టు మళ్లీ కథను మార్చి.. అనుకున్న కథను షెడ్ కి పంపిస్తాడని టాక్ ఉంది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘అదే కాదు.. ఆయన అనుకుంటే.. భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని.. ఎవర్నైనా వేరు చేస్తాడు. అదే మన గురూజీ స్పెషాలిటీ’ అని సెటైర్లు వేశారు.

అయితే ఈ ట్వీట్ల వ్యవహారంలో గురూజీ ఎవరనేది మాత్రం బండ్ల గణేశ్ వెల్లడించలేదు. నిజానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ డైరెక్టర్ ను కొందరు గురూజీ అంటూ పిలుస్తుంటారు. ఆయన్ను ఉద్దేశించే బండ్ల గణేశ్ వ్యంగ్యంగా ట్వీట్లు చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పనిలో పనిగా ‘అప్పట్లో మీరు కూడా ఇలానే ఖరీదైన బహుమతులు ఇచ్చారా అన్న’ అంటూ బండ్ల గణేశ్ కు కౌంటర్లు ఇవ్వడం కొసమెరుపు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates