HomeTelugu Trendingఅఖిల్‌కి మోనాల్‌ గిఫ్ట్

అఖిల్‌కి మోనాల్‌ గిఫ్ట్

monal special gift to akhil
తెలుగు బిగ్‌బాస్‌-4లో అఖిల్‌, సోహైల్‌ ఇద్దరిలో ఎవరు బిగ్‌బాస్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్‌, ల్యాప్‌టాప్‌ కొనివ్వాల్సిందేనని డీల్‌ మాట్లాడుకున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఎవర్ని విజయం వరించలేదు. అయితే వీరి కోరిక అసంపూర్తిగా మిగిలిపోలేదు. అఖిల్‌కు ఓ మహిళా అభిమాని ల్యాప్‌ట్యాప్‌ బహుమతిగా ఇచ్చింది. దీంతో అతడి సంతోషం కట్టలు తెంచుకుంది. తన మీద చూపిస్తున్న అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. ఈసారి ఏకంగా అతడి మనసుకు మరింత దగ్గరైనవాళ్లు ఓ బహుమతినిచ్చారు.

బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్‌తో లవ్‌ట్రాక్‌ నటిపిన ప్రేమ పావురం మోనాల్‌ గజ్జర్‌. ఈ షో తర్వాత కూడా అతడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో అఖిల్‌కు పూల ప్రింట్‌ ఉన్న రెడ్‌ షర్ట్‌ను బహుకరించింది. ఆమె ఇచ్చిన షర్ట్‌ ధరించి మోనాల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు అఖిల్‌. నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్‌గా కనిపిస్తున్నా కదూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. నిజంగానే అఖిల్‌కు పూలచొక్కా భలే సెట్టయ్యింది, ఎంతైనా మోనాల్‌ ఇచ్చింది కదా! అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu