HomeTelugu News"Banthipoola Janaki" Press Meet

“Banthipoola Janaki” Press Meet

‘బంతిపూల జానకి’ భలే ఎంటర్‌టైన్‌ చేస్తుంది!!
-చిత్ర బృందం 
రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’ అన్ని వర్గాల  పక్షకులను చక్కగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని, సినిమా చూసిన వాళ్ళంతా ‘భలే ఉందని’ మెచ్చుకొంటారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఉజ్వల క్రియేషన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26, శుక్రవారం  పక్షకుల ముందుకు వస్తోంది. 
ధన్‌ రాజ్‌, దీక్షాపంథ్‌, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు ‘బంతిపూ జానకి’లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఫిలిం చాంబర్ ప్రివ్యూ ధియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత రామ్, దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌, కథానయకుడు ధన్‌ రాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తేజ, సంగీత దర్శకుడు బోలే, రచయిత శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటర్‌ శివ వై ప్రసాద్‌ తోపాటు ముఖ్య అతిథిగా ప్రముఖ నటులు, సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ శివజీరాజా పాల్గొన్నారు.
‘బంతిపూ జానకి’ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్స్‌లో తనూ ఒకడినని, ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని శివాజీరాజా అన్నారు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరహాలో ‘బంతిపూల జానకి’ కూడా బిగ్‌ సక్సెస్‌ సాధిస్తుందని ఆయన పర్కొన్నారు. 
నిర్మాతగా ‘బంతిపూల జానకి’ తనకు తొలి చిత్రమని, తొలి చిత్రంతోనే ఘన విజయం అందుకోనుండడం చాలా ఆనందాన్నిస్తోందని ఉజ్వల క్రియేషన్స్‌ అధినేత రామ్‌ అన్నారు. దర్శకుడిగా తనకిది రెండో చిత్రమని, ఈ చిత్రం దర్శకుడిగా తనకు మంచి గుర్తింపునిచ్చి, తనకు అవకాశాలు తెచ్చిపెడుతుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు ప్రవీణ్‌చందర్‌ పర్కొన్నారు. 
హీరో ధన్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ‘బంతిపూల జానకి’ కథను నమ్మి ఈ చిత్రంపై కోటిన్నర ఖర్చు చేసి, మరో అరకోటి ప్రచారం నిమిత్తం ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. శేఖర్‌ విఖ్యాత్‌ సూపర్బ్‌ స్టోరీతోపాటు డైలాగ్స్‌ ఇచ్చాడు. బోలే బ్రహ్మాండమైన మ్యూజిక్‌ చేశారు. శివ చక్కగా ఎడిట్‌ చేశారు. మా ఎగ్జిక్యూట్‌ ప్రొడ్యూసర్‌ తేజ ఎక్స్‌లెంట్‌గా ఎగ్జిక్యూట్‌ చేశారు. వీళ్ళందరికి ‘బంతిపూల జానకి’ మంచి పరు తెచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. 
‘బంతిపూల జానకి’ చిత్రానికి పని చేసే అవకాశం రావడం పట్ల` రైటర్‌ శేఖర్‌ విఖ్యాత్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బోలే, ఎడిటర్‌ శివ సంతోషం వ్యక్తం చేశారు. 26న విడుదవుతున్న ‘బంతిపూ జానకి’ ఘనవిజయం సాధిస్తుందనడంలో తమకెలాంటి సందేహాలు లేవని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తేజ అన్నారు.
రాకెట్‌ రాఘవ, డా॥భరత్‌రెడ్డి, జీవన్‌, కోమలి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్‌.బాబు, పాటలు: కాసర్ల శ్యామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తేజ, నిర్మాతలు:: కళ్యాణి-రామ్, స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!