HomeTelugu Trendingఆకట్టుకుంటున్న'బెదురులంక2012' టీజర్‌

ఆకట్టుకుంటున్న’బెదురులంక2012′ టీజర్‌

Bedurulanka 2012 movie Teas 1

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాకి, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా అలరించనుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా ఈ టీజర్ విడుదల చేసింది చిత్రబృందం.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ .. లంకల గ్రామాలకి చెందిన ‘బెదురులంక’ అనే గ్రామంలో 2012లో నడిచే కథ. ఆ సమయంలో యుగాంతం జరగనున్నట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో ముడిపడిన సంఘటనలతో ఈ సినిమా సాగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.

ఈ టీజర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. హీరో .. హీరోయిన్ ప్రేమవ్యవహారం .. డ్రామా కంపెనీకి సంబంధించిన సందడిని కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. లవ్, యాక్షన్, కామెడీపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అజయ్ ఘోష్ , శ్రీకాంత్ అయ్యంగార్, రామ్ ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu