HomeTelugu Trending'ఎఫ్‌-3' టీమ్‌కి భారీ రెమ్యున‌రేష‌న్‌.. వైరల్‌

‘ఎఫ్‌-3’ టీమ్‌కి భారీ రెమ్యున‌రేష‌న్‌.. వైరల్‌

F3 movie cast and crew re
విక్టరీ వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్-‌2’ సూపర్‌ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించేందుకు ఎఫ్-2 సీక్వెల్ ఎఫ్ 3ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ సీక్వెల్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాదు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పొందింది.

ఈ మూవీకి జాతీయ స్థాయి అవార్డు కూడా వ‌చ్చింది. ఇక ఈ సినిమాకి ‘ఎఫ్ 3’ టీమ్‌కి భారీ రెమ్యున‌రేష‌న్‌ని ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఇక వారి రెమ్యున‌రేష‌న్‌కి సంబంధించిన ఓ లిస్ట్‌లో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. ఆ లిస్ట్ ప్ర‌కారం ఎవరి రెమ్యున‌రేష్ ఎంతంటే.. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: రూ.12కోట్లు, వ‌రుణ్ తేజ్: రూ.8కోట్లు, త‌మ‌న్నా: రూ.2కోట్లు, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా: రూ.70ల‌క్ష‌లు, క‌మెడియ‌న్ సునీల్: రూ.75ల‌క్ష‌లు, దేవీ శ్రీ ప్ర‌సాద్: 3 కోట్లు, అనిల్ రావిపూడి: రూ.12కోట్లు.

ఇక ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సీక్వెల్ మ‌రింత ఫ‌న్‌గా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌లో వెంకీ, వ‌రుణ్ డ‌బ్బులు ప‌ట్టుకొని ఉండ‌గా.. ఈ మూవీ డ‌బ్బు చుట్టు తిర‌గ‌బోతుందని వినికిడి. మ‌రో స‌మాచారం ప్ర‌కారం.. ఈ ఫ‌న్ సీక్వెల్‌లో గోపిచంద్ కూడా భాగం కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ఎఫ్ 2లో భాగ‌మైన కొంద‌రు ఇందులో కూడా న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu