HomeTelugu Trendingసైమా అవార్డు రేసులో ఉత్తమ హాస్యనటుల జాబితా

సైమా అవార్డు రేసులో ఉత్తమ హాస్యనటుల జాబితా

Best Comedian nominations f

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ (సైమా) ఎవరికి దక్కుతుందనేదానిపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఆ ఉత్కంఠకి తెరదించుతూ సెప్టెంబరు 18, 19 తేదీల్లో ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే పలు విభాగాలకు సంబంధించిన నామినేషన్లను ప్రకటించిన సైమా తాజాగా 2020 సంవత్సరానికిగానూ ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ పరిచయ దర్శకుడు, ఉత్తమ పరిచయ నిర్మాత అవార్డుకి పోటీ పడుతున్న వారి జాబితాను విడుదల చేసింది.

ఉత్తమ హాస్యనటుడు : వెన్నెల కిశోర్‌ (భీష్మ), హర్ష (కలర్‌ ఫొటో), సత్య (సోలో బ్రతుకే సో బెటర్‌), సునీల్‌ (అల వైకుంఠపురములో), సప్తగిరి (ఒరేయ్‌ బుజ్జిగా).

ఉత్తమ పరిచయదర్శకుడు: సుబ్బు (సోలో బ్రతుకే సో బెటర్‌), సందీప్‌ రాజ్‌ (కలర్‌ ఫొటో), కరుణ కుమార్‌ (పలాస 1978), శైలేష్‌ కొలను (హిట్‌), రమణ తేజ (అశ్వథ్థామ).

ఉత్తమ పరిచయనిర్మాత/ నిర్మాణ సంస్థ: అమృత ప్రొడక్షన్స్‌, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (కలర్‌ ఫొటో), సుధాస్‌ మీడియా (పలాస 1978), శ్రీ శక్తి స్వరూప్‌మూవీ క్రియేషన్స్‌ (రాహు), కారంపూరి క్రియేషన్స్‌ (ప్రెషర్‌ కుక్కర్‌), థర్డ్‌ ఐ ప్రొడక్షన్స్‌ (మధ).

Recent Articles English

Gallery

Recent Articles Telugu