స్టేజ్‌ పై జారి పడిన జెన్నిఫర్‌

ప్రముఖ పాప్‌ గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ వేదిక మీద నుంచి జారి పడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అమెరికా గాయని అయిన ఈమె ఆదివారం లాస్‌వేగాస్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాటపాడుతూ ప్రేక్షకులకు కరచాలనం చేస్తున్న సమయంలో కాలుజారి కిందపడ్డారు.

కిందపడిన వెంటనే అక్కడున్న వారి చేయి పట్టుకుని మళ్లీ లేచి పాడటం ప్రారంభించారు. జెన్నీ బాయ్‌ఫ్రెండ్‌ అలెక్స్‌ రొడ్రిగోజ్‌తో పాటు సెలెనా గోమేజ్‌, జెస్సికా ఆల్బా,దువా లిపా, బెక్కీ జీ, సోఫియా వెర్జరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెన్నీ కింద పడినప్పడు ఓ అభిమాని వీడియో తీసి దాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతోఈ వీడియో బాగా వైరల్‌ అవుతోంది. జెన్నీ కిందపడినా లేచి పాడటం ఆమె అంకితభావానికి నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్ల కామెంట్లలో కొన్ని..
జెన్నీకి పడి లేవడం కొత్తేం కాదు. ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆమె అంకితభావం అమోఘం. జెన్నీ కాకుండా ఇంకెవరయినా అయితే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయేవారేమో. జెన్నీ అలా ఎలా పడిపోయింది?. కింద పడినా ఎంత హుషారుగా పాటపాడింది?. జెన్నీ లైక్‌ ఏ డేర్‌ అండ్‌ డీర్