‘ఓ బేబీ’ సినిమా పక్కా ఫ్లాప్‌ అవుతుంది’ .. సమంత సమాధానం

ప్రముఖ సినీ నటి సమంతకు ట్విటర్‌లో ఓ ఆకతాయి నెటిజన్‌ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలోనూ విడుదల అవుతోంది. తమిళంలో సమంతకు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద డబ్బింగ్‌ చెప్పారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ చాలా కాలం తర్వాత తమిళంలో డబ్బింగ్‌ చెప్పినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ఇందుకు శైలజ అనే నెటిజన్‌ స్పందిస్తూ.. ‘చాలా సంతోషంగా ఉంది. దర్శకురాలు నందిని రెడ్డి, సమంతలపై అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమా చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్లు చూసిన కిరు అనే వ్యక్తి.. ‘ఫెమినిస్ట్‌లు అందరూ ఇక్కడే ఉన్నారుగా… ‘ఓ బేబీ’ సినిమా పక్కా ఫ్లాప్‌ అవుతుంది’ అని కామెంట్‌ చేశాడు. ఇందుకు సమంత వెంటనే.. ‘హ్హహ్హ… వరల్డ్‌.. ఇదిగో ఇడియట్‌.. ఇడియట్‌.. ఇదిగో వరల్డ్‌’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.