HomeTelugu Trending'భాగ్‌ సాలే' మూవీ ట్రైలర్‌

‘భాగ్‌ సాలే’ మూవీ ట్రైలర్‌

BHAAG SAALE Trailer

శ్రీసింహ నటించిన తాజా చిత్రం భాగ్‌ సాలే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. సింహ ఒక మంచి చెఫ్‌. వంట వండితే ఎలాంటి వారైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే. మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇతనికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి వాళ్ల నాన్నతో సింహ గురించి గొప్పగా, రాయల్‌ ఫ్యామిలీ అని పరిచయం చేస్తుంది. అలా సాఫీగా సాగిపోతున్న సింహ లైఫ్‌లోకి విలన్‌ ఎంటరవుతాడు.

డైమండ్ పొదిగి ఉన్న ఒక విలువైన రింగు కోసం ఎక్కడెక్కడో తిరిగి దానితో సింహ ఫ్యామిలీకి లింక్ ఉందని గుర్తించి విలన్‌ వీళ్ళ వెంటపడతాడు. మ్యాటర్ లేట్‌గా అర్థం చేసుకున్న అర్జున్ అక్కడి నుంచి ఫ్రెండ్స్‌తో కలిసి తప్పించుకునే రేస్ మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రింగ్‌ దొరికిందా? నిజంగానే సింహ ఫ్యామిలీకి రింగ్‌కు సంబంధం ఉందా? అనే విషయాలు తెలుసుకోవాలంటే జూలై 7న సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా సాగింది.

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. సింహకు జోడీగా నేహ సోలంకి నటించింది. వైవా హర్ష, రాజీవ్‌ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్‌ బెన్‌ సినిమా, సినీ వాల్లే మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu